Mon Mar 16 2026 16:45:20 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు ముంబయికి చంద్రబాబు... రాత్రికి విశాఖకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముంబయి బయలుదేరి వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముంబయి బయలుదేరి వెళ్లనున్నారు.ఈరోజు ముంబయిలో జరిగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ముంబయిలోని ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం ఐదుగంటలకు జరిగే ప్రమాణస్వీకారానికి హాజరు కానున్నారు. ఎన్టీఏ నేతలందరూ ఈ సమావేశానికి వస్తుండటంతో చంద్రబాబు కూడా విజయవాడ నుంచి ముంబయి బయలుదేరి వెళతారు.
రాత్రికి విశాఖపట్నానికి...
సాయంత్రం ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ముంబయి నగరం నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. విశాఖ పట్నంలో రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలెప్ మెంట్ అధారిటీ ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
Next Story

