Fri Dec 05 2025 23:52:27 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేటి రాత్రికి ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు నాయుడు కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, రావాల్సిన నిధులపై చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఎన్డీఏ సమావేశంలో...
మరొకవైపు ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ పక్ష పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ను ఖరారు చేయడంతో ఈ సమావేశంలో చర్చించి ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. తర్వాత జరిగే నామినేషన్ కార్యక్రమంలోనూ చంద్రబాబు పాల్గొనే ఛాన్స్ ఉంది.
Next Story

