Tue Mar 24 2026 01:47:01 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు హైదరాబాద్ కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఢిల్లీలో నిన్న మోదీ సహా కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు నాయుడు నేడు ఉదయం 9:30కి ఢిల్లీ నుంచి బయల్దేరనున్నారు. ఉదయం11:50 గంటలకుకి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చంద్రబాబు చేరుకుటారు. అక్కడి నుంచి నేరుగా మంత్రి టీజీ భరత్ కుమార్తె వేడుకకు హాజరు కాన్నారు.
రాత్రికి హైదరాబాద్ లోనే...
ఈ వివాహానికి ఏపీ మంత్రులతో కలసి చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ లోని తన నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళతారు. రాత్రికి హైదరాబాద్ లోనే చంద్రబాబు ఉండనున్నారు. రేపు ఉదయం బయలుదేరి ఆయన అమరావతికి చేరుకుంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

