Wed Dec 17 2025 11:13:23 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : 16న ఢిల్లీకి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 17న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 17న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కూడా చంద్రబాబు మోదీతో చర్చించనున్నారని తెలిసింది.
రాష్ట్రానికి రావాల్సిన...
దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలపై కూడా చంద్రబాబు మోదీని కలసి వినతిపత్రాన్ని అందించనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇప్పుడు మూడోసారి హస్తినకు వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలవనున్నారు.
Next Story

