Fri Mar 20 2026 07:23:46 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు రానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళతారు. ఈరోజు నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం 5.45 గంటల నుంచి ఆరు గంటల వకూ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది.
పట్టు వస్త్రాలను...
రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ప్రయివేటు ట్యాక్సీలపై ఆంక్షలు విధించారు. తొమ్మిది రోజుల పాటు ప్రయివేటు ట్యాక్సీలను అనుమతించరు. బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Next Story

