Wed Jan 21 2026 00:23:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ప్రతి శనివారం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఆయన ఇదివరకే ప్రకటించారు. అయితే సాయంత్రం వేళ చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. కానీ నేడు శనివారం నుంచి ఇకపై ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు రానున్నారు.
కార్యకర్తల సమస్యలను...
పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకుంటారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. ఇకపై ప్రతి శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. సాయంత్రం వస్తే తమ ఊళ్లకు వెళ్లేందుకు కార్యకర్తలు ఇబ్బందులు పడతారని భావించి చంద్రబాబు తన షెడ్యూల్ ను మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

