Sun Nov 03 2024 02:39:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు హైదరాబాద్ కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్కు రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్కు రానున్నారు. ఈరోజు నగరంలో జరిగే రెండు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 11.15 కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడనుంచి కొత్వాల్ గూడ లోని ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు.
రెండు కార్యక్రమాల్లో...
తిరిగి 12.30 కి అక్కడ్నుంచి బయల్దేరి ఉస్మానియా నగర్ తారామతి బారాదరి లోని వేసేళ్ల మెడోస్ కు చేరుకోనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని 1.20 కి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65 లోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఈ రెండు కార్యక్రమాల కోసంతో పాటు విజయదశమి వేడుకల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్కు రానున్నారు.
Next Story