Mon Apr 21 2025 18:31:28 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి చంద్రబాబు
ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు.

ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు..పలువురు కేంద్రమంత్రులతో భేటీకానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చించనున్నారని తెలిసింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 10.30 గంటలకు తిరుపతిలోని హీరో గ్రూప్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు.
నేటి షెడ్యూల్ ...
ఉదయం 11.00 గంటలకు అసెంబ్లీకి బయలుదేరి వెళ్తారు. `11.15 నుంచి 12.15 వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. 2.15 కి పర్సెప్షన్ ట్రాకింగ్ పై సమీక్ష చేస్తారు. తిరిగి చంద్రబాబు నాయుడు 2.30 గంటలకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
Next Story