Thu Feb 05 2026 03:41:03 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా ఢిల్లీలో ఉండనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా ఢిల్లీలో ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి. నిన్న రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబునాయుడు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్ర ప్రయోజనాలే...
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రెండు వారాల్లోనే తిరిగి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రులను కోరుతున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. ప్రధానంగా అమరావతి, పోలవరం నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించాలని ఆయన అందరినీ కలసి వినతిపత్రాలను అందిస్తున్నారు.
Next Story
