Sat Jul 12 2025 23:00:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు కూడా కుప్పంలో చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా కుప్పంలో పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా కుప్పంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన అనంతరం తొలిసారి కుప్పం నియోజకవర్గంలో ఆయన నిన్నటి నుంచి పర్యటిస్తున్నారు. నిన్న హంద్రీనీవా కాల్వలును పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
ప్రజల నుంచి వినతులు...
నిన్న రాత్రి ఆర్ అండ్ బి అతిథి గృహంలోనే బస చేసిన చంద్రబాబు నేడు కూడా కుప్పం నియోజకవర్గం ప్రజలుకు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారు. వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలను కూడా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చంద్రబాబు నేడు అక్కడే ఉండనున్నారు.
Next Story