Sat Mar 21 2026 10:06:25 GMT+0530 (India Standard Time)
శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం ప్రవేశం చేసిన చంద్రబాబుకు మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో...
దాదాపు అరగంట సేపు తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఉండనున్నారు. చంద్రబాబు ధ్వజస్థంభానికి నమస్కరించి బంగారు వాకిలి ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఆయనకు ప్రత్యేక ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాలు అందించారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది.
Next Story

