Thu Jan 29 2026 06:08:44 GMT+0000 (Coordinated Universal Time)
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మచిలీపట్నంలో పర్యటించారు. రోడ్లను శుభ్రం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి అయిన ఈరోజు నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన వీధులను చీపురుపట్టుకుని ఊడ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉంటామని చెప్పారు.
రోడ్లను ఊడ్చి...
పట్టణమైనా, గ్రామమైనా శుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు, మున్సిపల్ సిబ్బందితో కలసి ఆయన రోడ్డును శుభ్రం చేశారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తర్వాత నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు దేశానికి గాంధీజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన వల్లనే స్వాతంత్ర్యం సాధ్యమయిందన్నారు. ఆయన చేసిన పోరాటం కూడా అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు.
Next Story

