Fri Dec 05 2025 12:23:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపు నంద్యాల జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు రేపు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు. హంద్రీనీవా నీటిని రేపు చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు.
హంద్రీనీవా నీటి విడుదలను...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోవడంతో పాటు జలకళను సంతరించుకుని ఉండటంతో హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిని విడుదల చేసిన అనంతరం ముఖ్యమంబత్రి చంద్రబాబు నాయుడు రైతులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకంపై ప్రకటన చేయనున్నారు.
Next Story

