Fri Dec 05 2025 11:31:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు మంత్రులతో చంద్రబాబు లంచ్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంత్రులతో సమావేశం కానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంత్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సచివాలయలో మంత్రులతో కలసి చంద్రబాబు భోజనం చేస్తూ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు.
మోదీ పర్యటనపై...
ప్రధాని మోదీ పర్యటన వచ్చే నెల రెండో తేదీన ఉంది. మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు వస్తున్న సందర్భంలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలన్న దానిపై మంత్రులకు నేడు చంద్రబాబు పని విభజన చేయనున్నారు. వారికి అప్పగించిన బాధ్యతలను దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే సభకు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story

