Fri Dec 05 2025 13:38:20 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : కూర్చుని మాట్లాడుకుందాం.. పోరాటం దేనికి?
గోదావరి నదిలో మిగిలి పోయిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

గోదావరి నదిలో మిగిలి పోయిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాను ఎవరితోనూ గొడవపెట్టుకోననిచెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ అభివృద్ధి కావాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదని, అవసరమైతే ఢిల్లీలో కూర్చుని ఇరువురం మాట్లాడుకుందామని చంద్రబాబుచెప్పారు.మీరు కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండని తెలంగాణ ప్రభుత్వానికిచంద్రబాబు సూచించారు. తాను తెలంగాణ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోనని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మించినప్పుడు తాము ఎప్పుడైనా అభ్యంతరం చెప్పామా? అని ప్రశ్నించారు.
వృధాగా పోయే నీటిని...
సముద్రంలోకి వృధాలోకి పోయే నీటిని మాత్రమే వాడుకోవాలన్ని తమ ఆలోచన అని చంద్రబాబు అన్నారు. తెలంగాణతో తాను ఏనాడైనా గొడవలు పడ్డానా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ కట్టుకోవాలని, ఆ తర్వాతనే మిగిలిన నీటిని తాము వాడుకుంటామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటం అవసరం లేదని చెప్పారు. తనకు రెండు రాష్ట్రాల అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ఎవరినీరు వారిదని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా బనకచర్ల ద్వారా నీటిని రాయలసీమకు తరలించాలన్నదే తమ ఆలోచన అన్నారు. రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని చంద్రబాబు కోరారు. రెండు రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలని కోరుకున్నారు.
Next Story

