Sun Dec 21 2025 00:20:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సంపద సృష్టించడమే నాకున్న బ్రాండ్
సంపద సృష్టించడమే తనకున్న బ్రాండ్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

సంపద సృష్టించడమే తనకున్న బ్రాండ్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సిటీలో వివిధ సంస్థల సీఈవోలతో ఆయన సమావేశమై మాట్లాడుతూ శ్రీ సిటీ తిరుపతికి దగ్గరగా ఉండటం ఒక వరం అని అన్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టు దగ్గరగా ఉండటమే దీనికున్న అడ్వాంటేజీ అని అన్నారు. 1995లోనే తాను పెట్టుబడుల కోసం అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లి వచ్చానని తెలిపారు. శ్రీసిటీ కి దగ్గరలో మూడు పోర్టులు, మూడు ఎయిర్ పోర్టులు, హైవే ఉందని చంద్రబాబు గుర్తు చేశారు.
అమరావతి రాజధాని....
అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే ఏపీకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు ఐటీ ప్రొఫెనల్స్ ఇండియన్స్ అని చంద్రబాబు అన్నారు. అమరాతిని ఒక్క రూపాయి లేకుండా సేకరించామని చెప్పారు. అమరావతిని అద్భుతంగా నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. సంపద సృష్టించగలిగితే సంక్షేమం సజావుగా సాగుతుందని అన్నారు. పెట్టుబడులు రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే అవసరమైన రాయితీలు ఇస్తామని తెలిపారు
Next Story

