Sun Mar 15 2026 15:47:34 GMT+0530 (India Standard Time)
Chandrababu : పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఉన్నతాధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్టు సమీపంలో ఆయన అధికారులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎంత వరకూ పూర్తయిందన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అధికారులతో సమీక్ష...
పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. స్పిల్ వే, కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ వంటి వాటిపై ఆరా తీశారు. మధ్యాహ్నంరెండు గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్షించనున్నారు. చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story

