Mon Apr 21 2025 17:55:36 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అమిత్ షాను కలిసిన చంద్రబాబు దానిపై క్లారిటీ తీసుకున్నారుగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పలువురు కేంద్రమంత్రులను కలిశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే ఈ సందర్భంగా అమిత్ షాతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పాటు విభజన హామీల అమలుపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఏపీలో భర్తీ కానున్న ఐదు ఎమ్మెల్సీ పోస్టులు, విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అవ్వడంతో దాని ఎంపికపై కూడా అమిత్ షాతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.
ఖాళీ అవుతున్న స్థానాల్లో...
ఇప్పటికే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, మరో నాలుగింటిలో టీడీపీ, బీజేపీ స్థానాల పంపిణీపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే రాజ్యసభ స్థానం తమకు కావాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య రాజకీయ అంశాలే ఎక్కువగా జరిగినట్లు చెబుతున్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కూడా చంద్రబాబు అమిత్ షాను కోరినట్లు తెలిసింది
Next Story