Sun Mar 08 2026 15:08:59 GMT+0530 (India Standard Time)
ఏపీ గవర్నర్ తో చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్ కు వెళ్లి ఆయనను కలసిన చంద్రబాబు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. నవంబరు రెండో వారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని గవర్నర్ కు సమాచారం అందించినట్లు సమాచారం.
బడ్జెట్ సమావేశాలపై...
ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంతో పాటు ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ పై కూడా గవర్నర్ తో చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించడానికే చంద్రబాబు రాజ్‌భవన్ కు వెళ్లారంటును్నారు. దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి కూడా చంద్రబాబు గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది.
Next Story

