Fri Dec 05 2025 15:55:47 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : దావోస్ కు చంద్రబాబు బృందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి అర్థరాత్రి 1.30 గంటకు జ్యూరిచ్ కు వెళ్లారు. ఈరోజు ఉదయం జ్యూరిచ్ లో పలు సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. జ్యూరిచ్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. తరువాత హయత్ హోటల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
నేడు జరిగే సదస్సులో...
అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు వెళుతున్న ముఖ్యమంత్రికి అధికారులు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సిఎంవో అధికారులు సిఎం సర్....ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు. దావోస్ పర్యటన ఫలవంతం అవ్వాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story

