Fri Dec 05 2025 12:46:55 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సింగపూర్ లో నేడు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో నేడు పర్యటిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో నేడు పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో భారతీయ మహిళలు ఘన స్వాగతం పలికారు. నిన్న రాత్రి 11 గంటలకు హైదరాబద్ నుంచి బయలుదేరిన చంద్రబాబు నేడుసింగ్ పూర్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో చంద్రబాబు టీం ప్రయత్నిస్తుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పాటు పెట్టబడుల కోసం సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. ఐదు రోజుల పాటు సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామివేత్తలతో భేటీ కానున్నారు.
వివిధ కార్యక్రమాలలో...
సింగపూర్ తెలుగు డయాస్పో రాఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు నేడు పాల్గొననున్నారు. ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరుకానున్న 1500 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. సింగపూర్ లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సదస్సుకు ఏర్పాట్లు ఏపీ ఎన్ఆర్టీ పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చర్చిస్తారు. జీరో పావర్టీ, P-4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని.. తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఎలను చంద్రబాబు కోరనున్నారు.
Next Story

