Fri Dec 05 2025 14:04:39 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు నాలుగో రోజు చంద్రబాబు సింగపూర్ లో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నాలుగో రోజు సింగపూర్ లో పర్యటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నాలుగో రోజు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈరోజు కూడా పలు పారిశ్రామికవేత్తలతోనూ, ప్రభుత్వ ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. సింగనూపర్ ప్రభుత్వ ప్రతినిధులతో చంద్రబాబు నేడు ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. క్యాపిటాలాండ్ ఇన్విస్టిమెంట్స్, మండాయ్ వైల్డ్ లైఫ్ , ఎస్ఎంబీసీ బ్యాంక్, టెమసెక్ కంపెనీ ప్రతినిధులతో నేడు చంద్రబాబు భేటీ కానున్నారు.
ఒప్పందాలపై సంతకాలు...
అలాగే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ విదేశాంగ మంత్రితో సమావేశం అవుతున్నారు. అనంతరం నేషనల్ సెక్యూరిటీ అండ్ హోం అఫైర్స్ మంత్రితో జరిగే విందు సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం సెంబ్ క్రాప్ సీఓఓతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. నేడు కూడా పలు ఒప్పందాలను చంద్రబాబు కుదుర్చుకునే అవకాశాలున్నాయి.
Next Story

