Tue Dec 09 2025 09:24:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrabau : చంద్రబాబు కు ఇక ఏ సమస్య లేదుగా.. ముందు చూపు అదేగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫక్తు రాజకీయ నాయకుడు. ఆయనకున్న ముందు చూపు మరెవ్వరికీ ఉండదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫక్తు రాజకీయ నాయకుడు. ఆయనకున్న ముందు చూపు మరెవ్వరికీ ఉండదు. ఆయన ఇంటిపోరు సమస్య పెద్దగా ఉండదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని తాను చేతుల్లోకి తీసుకున్నప్పటికీ క్యాడర్ ను, నేతలను ఒప్పించగలిగారు. అంతేకాదు నందమూరి కుటుంబాన్ని మొత్తం తాను ఓన్ చేసుకోగలిగిన నేర్పరి. బాలకృష్ణతో వియ్యం అందుకుని నందమూరి కుటుంబం ఇక మరో మాట్లాడకుండా చేయగలిగారు. ఆయన తొలి నుంచి అంతే. ప్రాంతీయ పార్టీలు అంటే ఖచ్చితంగా ఇంటిపోరు ఉంటుంది. అది ఆయనకు ముందే తెలుసు కాబట్టి, అంచనా వేసి అందుకు అనుగుణంగా రాజకీయ అడుగులు వేసి తనకు, తన కుటుంబానికి తిరుగులేకుండా చేసుకోగలిగారు.
రెండు రాష్ట్రాల్లో...
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోనూ రాజకీయ వారసత్వం కోసం పోరాటం వీధులకు ఎక్కింది. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల విడిపోయి వేరు కుంపట్లు పెట్టుకుని జనం దృష్టిలో పలచన అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలోనూ కలతలు మొదలయ్యాయి. కలహాలు పెరిగి పెద్దదయి అన్నా చెల్లెళ్ల మధ్య భారీ గ్యాప్ పెరిగింది. రెండు పార్టీల్లో అన్న, చెల్లెళ్ల మధ్యే రాజకీయ వారసత్వం కోసం స్ట్రీట్ ఫైట్స్ జరుగుతుండటంతో పార్టీకి ఇబ్బందిగా మారింది. క్యాడర్ లోనూ కొంత ఆందోళన మొదలయింది. వైఎస్ కుటుంబంలో తల్లి, కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు.
టీడీపీలో ఆసమస్య లేదు...
కానీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఆ సమస్య లేదు. చంద్రబాబుకు ఒకే కుమారుడు. లోకేశ్ కు కూడా ఒకే కుమారుడు. టీడీపీలో కుటుంబ పోరుకు ఆస్కారం లేదు. పేరుకు నందమూరి పెట్టిన పార్టీయే కానీ ఇక భవిష్యత్ అతా తెలుగుదేశం పార్టీ నారా కుటుంబానిదే. అలా నరుక్కుటూ వచ్చారు. హరికృష్ణ కొంత విభేదించినా ఆయనను కూడా దారిలోకి తెచ్చుకోగలిగారు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని దశాబ్దాల పాటు దూరంగా ఉన్నప్పటికీ చివరకు ఆయననుకూడా దగ్గరకు చేర్చుకోగలిగారు. దగ్గుబాటి కుటుంబం నుంచి కూడా మద్దతు పొందేలా చేసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇక తన వారసులకు లైన్ క్లియర్ చేసుకోగలిగారు. ఇక చంద్రబాబు నాయుడు చేతుల్లోనే తెలుగుదేశం పార్టీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇక ఆయన తర్వాత నారా లోకేశ్ చేతికి అంది రావడంతో నందమూరి కుటుంబానికి నో ఛాన్స్ అని చెప్పకనే ఆయన చెప్పినట్లయింది.
Next Story

