Sun Mar 15 2026 08:53:41 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఇంటికి వెళ్లి పింఛను పంపిణీ చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. జులై ఒకటో తేదీ కావడంతో పింఛనుకు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఉదయం ఆరు గంటలకు చంద్రబాబు వెళ్లి పింఛనుదారులకు పెన్షన్ పంపిణీ చేవారు. మంత్రి లోకేష్ తో పాటు అధికారులతో కలసి పినపాక గ్రామానికి చేరుకున్న చంద్రబాబు లబ్దిదారు ఇంటికి వెళ్లి పింఛను ను పంపిణీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా...
పింఛను దారులు చంద్రబాబు స్వయంగా వచ్చి పింఛను పంపిణీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్లను సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వృద్ధులకు పింఛన్ల పంపిణీ జరుగుతుంది.
Next Story

