Sun Dec 14 2025 01:56:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పింఛనుదారులకు చంద్రబాబు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పింఛనుదారులకు లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పింఛనుదారులకు లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చడమే ప్రభుత్వం ప్రధమ కర్తవ్యమని ఆయన తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందన్నారు. మేనిఫేస్టోలో చెప్పిినట్లుగానే పింఛనును ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఆరువేల రూపాయల పింఛను చెల్లిస్తామని తెలిపారు. అందుకు సంతోషంగా ఉందన్న ఆయన జులై ఒకటో తేదీ నుంచి ఇంటివద్దకే పింఛన్లు అందిస్తామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఆర్థిక సమస్యలున్నా...
రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం తొలి రోజే ఈ నిర్ణయం తీసుకున్నామని లేఖలో వివరించారు. పింఛను పెంపుదల వల్ల ప్రభుత్వంపై నెలకు రాష్ట్ర ఖజానాపై 819 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని, అయినా ఎన్నికల ప్రచార సమయంలో కష్టాలు చూసి చలించి పోయి పింఛను మొత్తాన్ని పెంచామని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన వెయ్యి రూపాయలు కలిపి జులై నెల ఒకటో తేదీ ఏడువేల రూపాయలు పింఛను అందిస్తామని చెప్పారు.
Next Story

