Fri Dec 05 2025 21:49:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో ఐపీఎస్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐపీఎస్ అధికారుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐపీఎస్ అధికారుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. దీంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీలు పెద్ద సంఖ్యలో జరుగుతాయని తెలిపారు. మరో మూడు రోజుల్లోగా బదిలీ ఉత్తర్వులు వస్తాయని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. వచ్చే శనివారంలోగా ఐపీఎస్ బదిలీలు జరుగుతాయని, ఈ మేరకు ఐపీఎస్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
కలెక్టర్ల నియామకం తర్వాత...
కోస్తాంధ్రలో ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమితులవుతారన్న ప్రచారం జరుగుతుంది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలో మూడు నుంచి నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలు బాధ్యతలను చేపట్టనున్నారని, ఏడీజీపీ, ఐజీపీ, డీఐజీలకు పోస్టింగ్ లకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయినట్లు సమాచారం. తుది జాబితా సిద్ధమయిందని, రేపు జిల్లా కలెక్టర్ల బదిలీలు ఉండే అవకాశం ఉందని, తర్వాత ఐపీఎస్ బదిలీలుంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో నాలుగు నెలల నుంచి ఐపీఎస్ పోస్టింగ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story

