Fri Dec 05 2025 19:07:10 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పాత చంద్రబాబును చూస్తారు.. అధికారులకు సీఎం వార్నింగ్
పనిచేయని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.

పనిచేయని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్న రోజులు మర్చి పోవాలన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రివర్స్ వెళ్లే బండిని ముందుకు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొద్దిరోజులే అవుతున్నందున తాను స్లోగా వెళుతున్నానని, ఇక వేగం పెంచాల్సిందేనని అధికారులు తెలుసుకోవాలన్నారు.
1995లో నాటి...
1995లో నాటి ముఖ్యమంత్రిని చూస్తారని ఆయన పరోక్షంగా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. చరిత్ర గుర్తు పెట్టుకుని పని చేసుకుంటే అందరికీ మంచిదని సూచించారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టడంలో అధికారులు ప్రభుత్వానికి సహకరించాల్సిందేనని ఆయన మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన సభలో అన్నారు. లేకుంటే చర్యలు తీసుకోవడానికి తాను వెనకాడనని, అప్పుడు బాధపడి లాభం ఉండదని ఆయన స్పష్టం చేశారు. వేగంతో పాటు నైపుణ్యం కూడా అవసరమని ఆయన అన్నారు.
Next Story

