Sat Dec 06 2025 16:01:27 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : క్లేమోర్ మైన్స్ నన్ను ఏం చేయలేకపోయాయి... వీళ్లేం చేస్తారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. పెనుగొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయరును 8 నెలల్లో పూర్తి చేసి.. కియా పరిశ్రమ వచ్చేలా చేశానన్నచంద్రాబు ఆరు లక్షలకు ఎకరాలకు పైగా సాగు నీరు.. 33 లక్షల మందికి తాగు నీరు ఇస్తున్నామని తెలిపారు.2019లో ఓ పార్టీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఒక్క ఛాన్స్ అన్నారు.. ప్రజలూ ఏమార్చారని, . చంద్రబాబు బాగానే చేస్తున్నారు.. కానీ ఓసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నారని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే.. ఐదేళ్ల పాటు.. బాదుడే బాదుడు.. నరుకుడే నరుకుడే అన్నట్లుగా పాలన చేశారన్నారు.
కులలా మధ్య చిచ్చుపెడుతూ...
రాయలసీమ ప్రాజెక్టులకు పన్నెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిన పార్టీ టీడీపీ అన్న చంద్రబాబు వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాయలసీమ అంటూ సెంటిమెంట్ వైసీపీ రెచ్చగొడుతుందని, కులాల మధ్య చిచ్చు పెడుతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు.. మాటలు చెప్పడం ఈజీ.. కానీ పని చేయడం చాలా కష్టమని, హంద్రీ-నీవాపై వైసీపీ ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టిందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పంలో పెద్ద డ్రామా వేశారని, కాల్వల్లో నీళ్లు లేవని, ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి డమ్మి గేట్లు పెట్టి.. నీళ్లిచ్చామన్నారన్నారు. అలాంటి డ్రామాలు ప్రజలకు అవసరమా..? అని నిలదీశారు. క్లేమోర్ మైన్స్ కూడా నన్ను ఏమి చేయలేకపోయాయని, వీళ్ళు ఏం చేస్తారని అన్నారు.
Next Story

