Fri Dec 05 2025 15:43:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వారికి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆశావర్కర్ల వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో పాటు మరిన్ని వరాలను ఆశావర్కర్లకు ప్రకటించారు. ఆశావర్కర్లకు తొలి రెండు ప్రసవాలకు ఇకపై ఆరు నెలల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు.
గ్రాట్యుటీ కూడా...
అలాగే ఆశావర్కర్లకు గ్రాట్యుటీ చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 42,752 మంది ఆశా వర్కర్లు ఉండగా, వారు నెలకు పది వేల జీతం పొందుతున్నారు. పదవీ విరమణ చేసే సమయంలో వారికి ఒక్కొక్కరికి గ్రాట్యుటీ 1.5 లక్షలు చెల్లించనున్నారు. వేల సంఖ్యలో ఉన్న ఆశావర్కర్ల చేసే సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

