Fri Mar 20 2026 10:16:12 GMT+0530 (India Standard Time)
Chandrababu : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చేసిన ప్రకటన మహిళలకు ఊరటనిచ్చేలా ఉంది. దీపావళి రోజు నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలుకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
ఈ నెల 20వ తేదీ నుంచి...
ఇప్పటి వరకూ ప్రజలకు చేకూర్చిన ప్రయోజనాలను గురించి వివరించేందుకు వారి వద్దకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ప్రజల వద్దకు వెళ్లి ప్రతిపక్ష వైసీీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.
Next Story

