Sun Dec 07 2025 14:00:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సిందేనని తెలిపారు. ఎన్ని కష్టాలున్నా జీతాల చెల్లింపులో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం జరగకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.
ప్రతి నెల ఒకటోతేదీన...
ఏమాత్రం ఆలస్యమయినా తాను ఊరుకోబోనని కూడా ఉన్నతాధికారులను చంద్రబాబు హెచ్చరించారు. ప్రతినెల ఒకటో తేదీన జీతాలు పడితేనే వారు మంచిగా పనిచేస్తారని చెప్పారు. కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో ఆలస్యమవుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక విభాగాల్లో బకాయీలను చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకూ 22.507 కోట్ల రూపాయల బకాయీలను చెల్లించామని తెలిపారు.
Next Story

