Fri Dec 05 2025 13:52:34 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాలపై రెవెన్యూ, మునిసిపల్, హౌసింగ్ మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. అభ్యంతరం లేని నివాస స్థలాకు డిసెంబర్ లోగా రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రొటోకాల్ పై ఆదేశాలు...
2027 డిసెంబర్ నాటికి రీ సర్వే 2.0.. భూ వివరాలు దృశ్యరూపంలో కనిపించేలా ప్రత్యేక పోర్టల్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రోటోకాల్ విధుల నుంచి రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఏ మంత్రి పర్యటన కు వెళితే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్ లో వెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story

