Tue Dec 16 2025 22:08:31 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradsh : కేబినెట్ లో క్లాస్ పీకిన చంద్రబాబు...ఎమ్మెల్యేలకు, కొందరు మంత్రులకు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్లను పరిశీలించి దానిపై సంతకం చేయాలని అన్నారు. అధికారులు మాటగా కాకుండా లోతుగా అధ్యయనం చేయాలని, ఫైలు పూర్వాపరాలను కూడా తెలుసుకుని క్లియర్ చేయడం మంచిదని సూచించినట్లు తెలిసింది. అలాగే తమకు ఇన్ ఛార్జి పదవి అప్పగించిన జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరును కూడా గమనించాలని ఆయన కోరినట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైందని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రధానంగా ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకుంటే తానే స్వయంగా జోక్యం చేసుకోక తప్పదని హెచ్చరించినట్లు తెలిసింది.
తప్పు చేసింది ఎవరైనా?
తప్పు చేసిన వారు ఎవరైనా వదిలేది లేదని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని, జనంలో ఉండాలని, అంతే తప్ప నిత్యం వివాదాల్లో కాదన్న విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న విపక్షాలు జనంలోకి తీసుకెళ్లి పార్టీతో ప్రభుత్వం కూడా అభాసుపాలు జేసేలా వ్యవహరిస్తారని చంద్రబాబు అన్నారు. అలాగే మహిళల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ సిబ్బంది, అధికారుల పట్ల మర్యాదపూర్వకంగానే వ్యవహరించాలని, ఏదైనా తప్పు జరిగితే అది ఎత్తి చూపే అవకాశం వేరే మార్గాల ద్వారా ఉంటుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఈ సంస్కృతి ఏంటి?
సోషల్ మీడియా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్న ఈ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా నష్టం వాటిల్లేది వ్యక్తిగతంగా మాత్రమే కాదని, కూటమి ప్రభుత్వానికి అని గుర్తుంచుకోవాలని చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. రోడ్డు మీదకువచ్చి దాడులు చేసే సంస్కృతి ఏంటని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని,పార్టీ పరంగా కాకుండా భవిష్యత్ లో వారికి రాజకీయం చేసేందుకు కూడా అవకాశం ఉండదని ఒకింత గట్టిగానే చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story

