Thu Feb 05 2026 05:25:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హర్యానాకు చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ నేడు హర్యానాకు వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ నేడు హర్యానాకు వెళ్లనున్నారు. ఈరోజు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారంతో పాటు ఎన్టీఏ పక్ష సమావేశంలో ఇద్దరు పాల్గొంటారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం వీరిద్దరూ తిరిగి విజయవాడకు చేరుకుంటారు.
ఎన్డీఏ సమావేశంలో...
ఎన్డీఏ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చించే అధికారముంది. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి చర్చ జరిగే అవకాశముందని చెబుతున్నారు. వీటితో పాటు జమిలి ఎన్నికలపై కూడా చర్చ జరుగుతుందని కొన్ని పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ఎన్డీఏ నేతలందరూ హాజరవుతున్నారు.
Next Story
