Thu Dec 18 2025 07:28:51 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు తిరుమలలో చంద్రబాబు
రెండో రోజు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నేడు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

రెండో రోజు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు.నేడు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 13.40 కోట్ల రూపాయలతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
చిన శేష వాహనంపై...
ఈరోజు తిరుమల శ్రీవారు చిన్నశేష వాహనంపై భక్తులకు మాడవీధుల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవ ఉండనుంది. నిన్న తిరుమలకు చేరుకున్న చంద్రబాబు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈరోజు తిరుమల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. అమరావతికి చేరుకుంటారు.
Next Story

