Fri Dec 19 2025 20:20:40 GMT+0000 (Coordinated Universal Time)
ర్యాంకుల తక్కువ చేసి చూపడానికి కాదన్న చంద్రబాబు.. రీజన్ ఇదేనా?
మంత్రుల ర్యాంకింగ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు

మంత్రుల ర్యాంకింగ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి వర్గ సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్ పై మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం అందులో చంద్రబాబుకు ఆరు, లోకేష్ కు ఎనిమిది, పవన్ కల్యాణ్ కు పదో ర్యాంకు రావడంతో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు ఆయన చెక్ పెట్టేశారు. టీమ్ వర్క్‌గా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్న చంద్రబాబు అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణంచేయొచ్చు అని అన్నారు.
అందుకే ఇచ్చామన్న...
అందుకే ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఎవరినీ తక్కువ చేయడానికి ర్యాంక్‌లు ఇవ్వలేదన్నచంద్రబాబు ఇది పాలనలో వేగం పెంచే ప్రయత్నం అని తెలిపారు. తన స్థానాన్ని కూడా మెరుగుపర్చుకోవాల్సి ఉందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. మంత్రులు శాఖల్లో మంచి ప్రతిభ చూపించాలని చంద్రబాబు కోరారు. అంతే తప్ప ఎవరినీ తక్కువ చేసి చూపించేందుకు ర్యాంకులు ఇవ్వలేదని, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి అధికారుల వరకూ శ్రమించాల్సి ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
Next Story

