Sun Mar 15 2026 14:29:18 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఆరోరోజూ కూడా కలెక్టరేట్లోనే చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఆరు రోజుల నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఆరు రోజుల నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటున్నారు. అక్కడే బస చేసి సమీక్షలు చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు అధికారులతో సమీక్షలు చేస్తూ వారికి ఆహారం, నీరు వంటివి పంపిణీలో ఏమాత్రం జాప్యం జరగకుండా చూసుకుంటున్నారు.
కేంద్రానికి నివేదిక...
మరోవైపు కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వానికి వరద నష్టంపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పంపే అవకాశముంది. ఈరోజు కూడా చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. వరద ప్రాంతాలకు వెళ్లి బాధితులను అడిగి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. వరదలు సంభవించినప్పటి నుంచి చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉంటూ వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
Next Story

