Fri Dec 05 2025 15:54:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్ పోర్టులో ఇద్దరు సీఎంల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు. ఇద్దరు కాసేపు తాజా రాజకీయాలపై చర్చించారు. విమానాశ్రయంలోని లాంజ్ లో రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ఇద్దరూ జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో కలిశారు. దావోస్ పర్యటనకు ఇద్దరూ పెట్టుబడుల కోసం తమ రాష్ట్రాలకు తెచ్చేందుకు వెళ్లారు.
రాజకీయ అంశాలపై...
అయితే జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి అనేక విషయాలపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనసమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన హామీల అమలుపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. అలాగే రెండు రాష్ట్రాల రాజకీయాలపై కూడా చర్చించుకున్నారని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు ఉండగా, రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు.
Next Story

