Tue Mar 24 2026 15:17:10 GMT+0530 (India Standard Time)
జనసేనాని పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పైనా, కారు డ్రైవర్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదయింది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్ ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెనాలి మారిస్పేటకు చెందని శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇప్పటం వచ్చే క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కొద్దిదూరం కాలినడకన వచ్చిన పవన్, తర్వాత కారు టాప్ పై కూర్చుని, కాళ్లు చాపుకుని ప్రయాణించారు. పక్కనే మరికొందరు కూడా ఆయన్ను పట్టుకుని ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయింది.
Next Story

