Fri Aug 12 2022 02:53:49 GMT+0000 (Coordinated Universal Time)
రాజధానిపై హైకోర్టు సీజే ఆసక్తికర వ్యాఖ్యలు

రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలన్న దానిపై విచారణ జరగడం లేదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలపైనే తాము విచారణ జరుపుతున్నానమి ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు.
రోజు వారీ విచారణ....
న్యాయవాదులు ఆదినారాయణరావు, మురళీధరరావులు తమ వాదనలను విన్పించారు. అమరావతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు అంశాలపై హైకోర్టులో రోజు వారీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును త్వరితగతిన పూర్తి చేస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇప్పటికే చెప్పడంతో ప్రతిరోజూ దీనిపై విచారణ జరుగుతోంది.
Next Story