Sat Mar 21 2026 03:16:50 GMT+0530 (India Standard Time)
రేపు ఏపీ కేబినెట్ సమావేశం
రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది.
కీలక నిర్ణయాల దిశగా...
ఇక రాజధాని అమరావతి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా చర్చకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలపై కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు ఓపీఎస్ పై కూడా చర్చించే అవకాశముంది. ఈ కేబినెట్ లో కీలక బిల్లులను ఆమోదించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
Next Story

