Thu Mar 19 2026 13:32:35 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. కీలక నిర్ణయాలకు అమోదం తెలపనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.
భూముల కేటాయింపు...
దీంతో పాటుగా పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రేపు జరిగే సమావేశంలో కిన్ని సూపర్ సిక్స్ హామీలపై క్లారిటీ వచ్చేఅవకాశముంది.
Next Story

