Fri Mar 20 2026 23:53:33 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. వైఎస్ జగన్ జరగనున్న ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జరగనున్న ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సిన తేదీలను కూడా నిర్ణయించే అవకాశముంది.
కీలక నిర్ణయాలు...
ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించున్నారు. దీంతో పటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడులకు సంబంధించిన వాటికి మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ తెలపనుంది. మరికొన్ని ముఖ్య నిర్ణయాలను వెల్లడించే అవకాశముంది.
Next Story

