Sat Mar 21 2026 05:12:39 GMT+0530 (India Standard Time)
నేడు కేబినెట్ భేటీ.. మంత్రుల రాజీనామాలను?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రస్తుత మంత్రివర్గ సభ్యులకు ఇదే చివరి సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రస్తుత మంత్రివర్గ సభ్యులకు ఇదే చివరి సమావేశం. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండటంతో ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించకపోయినా మంత్రి వర్గం నుంచి వైదొలగునున్న మంత్రులతో జగన్ నేరుగా మాట్లాడతారు. వారికి ఏ యే బాధ్యతలను అప్పగిస్తున్నదీ చెబుతారు. ముందు చెప్పినట్లుగానే రెండున్నరేళ్ల తర్వాత విస్తరణ చేపట్టానని, ఎవరూ అసంతృప్తికి లోను కావద్దని, అందరికీ అవకాశం వస్తుందని జగన్ మంత్రులకు నచ్చ చెప్పనున్నారు.
అందరి రాజీనామాలను....
మరోవైపు ఈరోజు మంత్రి వర్గ సభ్యుల చేత రాజీనామా లేఖలను కూడా తీసుకోనున్నారు. 25 మంది మంత్రుల రాజీనామాలను జగన్ తీసుకునే అవకాశముంది. అయితే వీరిలో కొనసాగేది ఎవరు? మంత్రి వర్గం నుంచి వెళ్లిపో్యేదెవరు? అన్న దానిపై మాత్రం ఈ నెల 11వ తేదీన మాత్రమే క్లారిటీ రానుంది.
Next Story

