Sat Mar 07 2026 19:52:32 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు దిశగా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.
వివిధ అంశాలపై....
ప్రధానంగా ఆగస్టు నెల 15వ తేదీ నుంచి అన్నా క్యాంటిన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. వంద క్యాంటిన్లను ప్రారంభించాలన్న లక్ష్యంతో పెట్టుకున్నారు. పది రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనిపై చర్చ జరిగే అవకాశముంది. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశముందని తెలిసింది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి
Next Story

