Sat Mar 07 2026 19:48:55 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు మంత్రి వర్గ సమావేశం.. వారికి గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ సమావేశం జరనగుంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. కొత్త ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయని తెలిసింది.
పలు పథకాలకు సంబంధించి...
కొత్త ఏడాది ప్రారంభించబోయే పథకాల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో పాటు పలు సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులపై కూడా చర్చ జరిగే అవకాశముంది. సమావేశం అనంతరం దీంతో పాటు విశాఖ, విజయవాడలోని మెట్రో రైలు ప్రాజెక్టులపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారని తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

