Sun Mar 22 2026 23:31:08 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఈ నెల 3న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 3వ తేదీన జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 3వ తేదీన జరగనుంది. అయితే ఉదయం పదకొండు గంటలకు జరగాల్సిన సమావేశాన్ని మధ్యాహ్నం మూడు గంటలకు మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈసమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అక్టోబర్ 3న జరిగే ఏపీ కేబినెట్ భేటీలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మధ్యాహ్నం మూడు గంటలకు...
అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు కాకుండా సాయంత్రం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరగుతుందని తెలిపారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అమరావతి రాజధాని పనులు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, వివిధ సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.
Next Story

