Tue Feb 03 2026 06:56:57 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నవంబరు 6న ఏపీ మంత్రి వర్గ సమావేశం
నవంబరు 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది

నవంబరు 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల గురించి ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. నవంబరు 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది.
బడ్జెట్ సమావేశాలపై...
వారం రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహిస్తుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. దీనిపై ముందుగా నవంబరు 6వ తేదీన మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అందుకే నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారని అధికారిక వర్గాలు తెలియచేశాయి. నవంబరు రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, పూర్తి స్థాయిబడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది.
Next Story

