Fri Mar 20 2026 23:54:46 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : 31న కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు
ఈ నెల 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.

ఈ నెల 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేసే అవకాశముందని చెబుతున్నారు.
ఎన్నికల వేళ...
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జగన్ ప్రభుత్వం ఈ మంత్రివర్గ సమావేశంలో కొత్త నిర్ణయాలను కూడా వెల్లడించనుందని తెలిసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రధాన అంశాలు ఏవి తీసుకోవాలన్న దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మరికొన్ని భూ కేటాయింపుల విషయంలోనూ మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశముంది.
Next Story

