Sat Mar 07 2026 23:56:33 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : 24న మంత్రివర్గ సమావేశం..కీలక నిర్ణయాలు దిశగా
ఈనెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది.

ఈనెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులోని మంత్రి మండలి సమావేశ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
అజెండా అంశాలకు...
రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈనెల 21వతేది సాయంత్రం 4గంటల లోపు సమర్పించాలని అన్ని శాఖల కార్యదర్శులకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారం వెంటనే తయారు చేసి అందచేయాలని కోరారు.
Next Story

